![]() |
![]() |
.webp)
నెక్స్ట్ వీక్ ఆట షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి జడ్జ్ నిహారిక వాళ్ళ అమ్మ పద్మ వచ్చారు. "నాకు చాలా నచ్చుతుంది ఎవరైనా మీ అమ్మలా ఉన్నవని చెపితే ఎందుకంటే మా అమ్మ చాలా అందమైన అమ్మాయి" అని చెప్పింది. ఇక సుధీర్ వాళ్ళ అమ్మతో చిట్ చాట్ చేసాడు. "ఇంట్లో డామినేషన్ ఎవరు వరుణ్ గారా నిహారిక గారా. చిన్నప్పుడు వరుణ్ గారిని బాగా కొట్టేదంట కదా " అని అడిగాడు. నిహారికనే డామినేషన్.. చిన్నప్పుడు వరుణ్ ని బాగా కొట్టేది అని చెప్పారు. "చిన్నప్పుడు మా అమ్మ ఎప్పుడూ మా అన్నకే సపోర్ట్ చేసింది నాకెప్పుడూ సపోర్ట్ చేయలేదు " అంది నిహారిక. "నువ్వు మీ నాన్న ఒకటి కాదమ్మా " అన్నారు నిహారిక వాళ్ళ అమ్మ . "స్కూల్ ఎగ్గొట్టడాలు లేకపోతె కాలేజీలు " అని సుధీర్ అడిగేసరికి "బోర్డు మీద టీచర్ ఎం రాసినా రాసుకునేది కాదు రెండో రోజు నేను వెళ్లి అన్నీ నోట్సులు నేను రాసుకుని వచ్చేదాన్ని వరుణ్ ఉన్న కాలేజీ నుంచే ఎగ్గొట్టి బయటకు వెళ్లేదానివి అదే ఇంకా గర్ల్స్ కాలేజీ లో చేర్పిస్తే ఇంకేం చేసేదానివో" అనేసరికి నిహారిక సైలెంట్ గ తలదించుకుని కూర్చుంది. "నీహారిక గారు వంట చేస్తారా అండి " అని సుధీర్ అడిగాడు. "నిహారిక వంట చేస్తది కానీ ఆ తర్వాత మనం కిచెన్ లోకి వెళ్లాం అంటే సర్దుకోలేక చచ్చిపోవాలి." అనేసారు నిహారిక వాళ్ళ అమ్మ ."ఏవండీ కన్ను ఏమీ అనొద్దు అని చెప్పండి. ఏదైనా స్వీర్ వార్నింగ్ ఇవ్వండి" అని అడిగాడు సుధీర్. "నిన్ను అంటేనే బాగుంటుంది " అని ఆవిడ అనేసరికి అందరూ నవ్వేశారు. ఆ తర్వాత నిహారిక వాళ్ళ అమ్మ గుసగుసలాడుకున్నారు. "ఈ రెండు గంటలకు నా రెమ్యూనరేషన్ ఇస్తే వెళ్ళిపోతాను అంటోంది " అని వాళ్ళ అమ్మ అన్న విషయాన్ని చెప్పేసింది నిహారిక.
![]() |
![]() |